Tuesday 26 April 2022

ప్రబోధము

 అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ

విద్యాలయములు స్థాపించునాడు,

ఓరుగల్లున రాజవీరలాంఛనముగ

బలు శస్త్రశాలలు నిలుపునాడు,

విద్యానగర రాజవీధులఁ  గవితకు

పెండ్లిపందిళ్ళు గప్పించునాడు,

పొట్నూరికి సమీపమున నాంధ్రసామ్రాజ్య

దిగ్జయస్తంభ మెత్తించున్నాడు;

ఆంధ్రసంతతి కే మహితాభిమాన

దివ్యదీక్షాసుఖస్ఫూర్తి తీవరించె

నా మహావేశ మర్ధించి యాంధ్రులార

చల్లు డాంధ్రలోకమున నక్షతలు నేడు:

 

తన గీతి యఱవజాతిని పాఠకులనుగా

దిద్ది వర్ధిల్లిన తెనుఁగువాణి,

తన పోటులు విరోధితండంబులకు సహిం

పనివిగా మెరిసిన తెనుఁగుకత్తి,

తన యందములు ప్రాంతజనులకు కభిరుచివా

సన నేర్ప నలరిన తెనుఁగురేఖ,

తన వేణికలు వసుంధరను సస్యశ్యామ

లనుజేయ జెలఁగిన తెనుఁగుభూమి,

 

అస్మదార్ద్ర మనోవీధి నావహింప

జ్ఞప్తి కెలయించుచున్నాడు; చావలేదు,

చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వలచరిత్ర

హృదయములు చీల్చి చదువుడో సదయులార

 

కృష్ణాతరంగపంక్తిన్ ద్రొక్కి త్రుళ్ళింత

నాంధ్రనౌకలు నాట్యమాడునాడు,

ఇంటింట దేశిసాహిత్య దీపములతో

నాంధ్రతేజస్సు రాపాడునాడు ,

 

సుకుమార శిల్పవస్తు ప్రపంచమునందు

నాంధ్రనైపుణి పంతమాడునాడు

సమరసేనావ్యూహ జయపతాకల క్రింద

నాంధ్రపౌరుషము చెండాడున్నాడు

 

                                           - రాయప్రోలు  

ప్రబోధము

  అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగ బలు శస్త్రశాలలు నిలుపునాడు, విద్యానగర రాజవీధు...