Thursday, 17 March 2022

స్వాతంత్ర్య రధము


అంబుదంబుల నమృతపూరంబు లొలుక

నింద్రచాపంపుదొరణ మింపుగులుక

గాఱుమెఱుగులు నెల్లెడ గడలు కొనగ

వెడెలె స్వాతంత్ర్యరధము విన్వీధియందు

 

జలధరమాల జీల్చికొని న్యంధనకాంతి

నభోంతరాళ ముజ్జ్వలితముచేసి, యంధ

తమసంబులు వాఱిన మూలనైన శోభల

ననలెత్తజేయుచు, ప్రభాతవిభాకర బింబమట్లు

సొంపిలుచు, నవీనజీవనము వింతగ నింపే

సమస్త సృష్టిలోన్

 

ఆ రథమందు దీప్తమయమై కనుపెట్టె

నిజప్రభావ దుర్వార పవిత్రమూర్తి

కనుపండువు సేయుచు; ధర్మజీవనాకారమో,

శాంతిబింబమో, యకల్మష సత్యనికేతనంబొ,

సంసారఫలస్వరూపమో, ప్రజాహృదయంబొ

యనన్  వెలుంగుచున్ :

 

ఒకచేతన్ రుధిరంపుఁబాత్రమును,

వేరొక్కంట బీయూషపాత్రికయుం గైకొని,

'సభ్యతామిషమునన్ దేశంబులం దెల్ల నింతకు

ధర్మంబులుగాగ నెన్నఁబడు నన్యాయంబు

లీనాటికితో వికలంబై చనుగాక యంచు

గరుణా వేశమ్ము దీపింపగన్ :

 

పచ్చినెత్తురు నమృతంపు బాత్ర బోసి

దివ్యదుగ్ధంబుగా మార్చె దేవిమహిమ,

హాలహలగర్భమందైన నమృతరసము

సంభవించు నటం చిల జాటనేమొ :

 

నిలువదు స్యందనంబు ధరణీపతిపాలన

దండభీతిచే, నిలువ దనాదభాష్పములు

నిల్చిన పల్లపునేల, మోసగింపుల మఱపించు

క్రించు దనపుంజతురాత్ముల కాగబో,

దనర్గళజపమొప్ప నేగెడిని గన్నులకుం

గనరానిచోటికి :

 

పూర్వసింహాసనంబులు, ప్రోజ్జ్వలంపు

మణిమయకిరీటములు, భోగమందిరములు

చక్రసంఘర్షణంబున జడిసిపోయి

యవి యివి యనంగరాక రూపఱెడు నేడు :

 

లేవు దివ్యతురంగముల్, లేవు కరులు,

ప్రజలె యా తేరు మోకుల బట్టువారు,

వాయుజవమున దారకాథ్వమున నేగు

నంతరాయశతంబులనైనా దాటి :

 

తేరు జాడల నెత్తురు పాఱిపోఱి

బంగరుంబంట బండించె బక్కనేల,

జక్రాన్ములు దాఁకిన స్థలము లెల్ల

సస్యలక్ష్మికి గళ్యాణశాల లయ్యె :

 

స్యందనాసీన యగు దేవి "శాంతి శాంతి"

యనుచు మంజులగా నమ్ము నలర జేసి

నవ్యనక్షత్ర వీణా స్వనమ్ములందు

మేల్లవించెను, జనులు విస్మితులు గాగ :

 

-      రామిరెడ్డి 

ప్రబోధము

  అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగ బలు శస్త్రశాలలు నిలుపునాడు, విద్యానగర రాజవీధు...