గోదావరీ పావనోదారవాఃపూర
మఖిలభారతము మా దాన్ననాడు,
తుంగభద్రాసముత్తుంగ రావముతోడ
కవులగానమ్ము శ్రుతి గలయున్నాడు,
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించున్నాడు
శిల్పమ్ము తొలిపూజ సేయునాడు:
అక్షరజ్ఞానమెఱుఁగదో యాంధ్రజాతి,
విమలకృష్ణానదీసైతకములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమానిశలయందు:
- విశ్వనాథ సత్యనారాయణ
No comments:
Post a Comment