దేశమును ప్రేమించుమన్నా,
మంచి అన్నది పెంచుమన్నా,
వొట్టిమాటలు కట్టిపెట్టవోయి :
గట్టి మేలు తలపెట్టవోయి :
పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువ్వు పాటుపడవోయి ;
తిండి కలిగితె కండ కలదోయి,
కండగలవాడేను మనిషోయి :
యీసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయి ?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశిసరుకులు నించవోయి :
అన్నిదేశాల్ క్రమ్మవలెనోయి
దేశిసరుకుల నమ్మవలెనోయి :
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి :
వెనక చూచిన కార్య మెమోయి ?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయ్ :
వెనకపడితే
వెనకేనోయ్ :
పూను స్పర్ధను
విద్యలందే
వైరములు వాణిజ్యమందే
;
వ్యర్ధకలహం పెంచబోకోయ్
కత్తివైరం కాల్చవోయ్
:
దేశాభిమానం నాకు
కద్దని
ఒట్టిగొప్పలు
చెప్పుకోకోయ్,
పూని యేదై నాను
ఒక మేల్
కూర్చి జనులకు
చూపవోయ్ :
ఓర్వలేమిపిశాచి,
దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
:
ఒరుల మేలుకు
సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
:
పరుల కలిమికి
పొర్లి యేడ్చే
పాపి కెక్కడ
సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన
మే లనెంచే
నేర్పరికి మేల్
కొల్లలోయ్ :
స్వంత లాభం కొంత
మానుకు
పొరుగువాడికి
తోడుపడవోయ్:
దేశమంటే మట్టికాదోయ్,
దేశమంటే మనుషులోయ్:
చెట్టపట్టాల్
పట్టుకొని
దేశస్థు లంతా
నడవవలెనోయి,
అన్నదమ్ములవలెను
జాతులు
మతము లన్నీ మెలగవలెనోయ్:
మతం వేరై తేను
యేమోయ్ ?
మనసు లొకటై మనుషు
లుంటే
జాత మన్నది లేచ్చి
పెరిగి
లోకమున రాణించునోయ్
:
దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్,
నరుల చెమటను
తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
:
ఆకులందున అణిగి
మణిగీ
కవిత కోకిల పలక
వలెనోయ్,
పలుకులను విని,
దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోయ్
:
- - గురజాడ
అప్పారావు
No comments:
Post a Comment